నో పెళ్ళి … ” సోలో బ్రతుకే సో బెటరు ” అంటున్న సాయి ధరమ్ తేజ్..!

-

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం “సోలో బ్రతుకే సో బెటరు”. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటి నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వరుస ఫ్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ దక్కించుకున్న ఈ యంగ్ హీరో రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతీరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సోలో బ్రతుకే సో బెటరు” సినిమాని ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

 

క్యాచీ టైటిల్ తో యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసేలా ఉన్న ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుండి నో పెళ్ళి అనే సాంగ్ విడుదల కానుంది. మే 25వ తేదీ ఉదయం 10గంటలకి నో పెళ్ళి అనే సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

 

టాలీవుడ్ లో బ్యాచ్‌లర్స్ అందరూ ఒక్కొక్కరూ పెళ్ళిపీటలెక్కుతున్న తరుణంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన తాజా సినిమా నుండి ఈ పాట విడుదల కావడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ పాట కోసం ఇప్పుడు టాలీవుడ్ తో పాటు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. మాంచి ఊపు మీదున్న థమన్ ఈ సాంగ్ తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news