వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళ్తున్న నేచుర‌ల్ బ్యూటీ.. సాయిప‌ల్ల‌వి స‌క్సెస్ జింద‌గీ!

భానుమ‌తి హైబ్రిడ్ పిల్ల‌.. ఒక్క‌టే పీస్ అంటూ తెలంగాణ యాస‌లో తొలి సినిమాతోనే అంద‌రినీ ఫిదా చేసింది సాయిప‌ల్లవి. నేచుర‌ల్ బ్యూటీగా బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఎలాంటి మేక‌ప్ లేకుండా సినిమాల్లో న‌టించ‌డం ఈ అమ్మ‌డు స్పెషాలిటీ. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాల సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

తెలుగులో వ‌రుస‌గా విరాట‌ప‌ర్వం, ల‌వ్‌స్టోరీ సినిమాలు ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంది. ఇక నాని స‌ర‌స‌న శ్యామ్‌సింగ‌రాయ్‌లో జోడీ క‌డుతోంది. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది ఈ మ‌ళ‌యాల ముద్దుగుమ్మ‌.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా త‌మిళంలో సూప‌ర్‌హిట్‌గా నిలిచిన క‌ర్ణ‌న్ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో సాయిపల్ల‌విని తీసుకుంటున్నారంట‌. త‌మిళంలో అటు మ‌ళ‌యాలంలో కూడా సాయిప‌ల్ల‌వికి మంచి క్రేజ్ ఉండ‌టంతో ఆమెనే తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట టీమ్‌. ఇక ఈ పిల్ల కూడా సినిమాకు ఓకే చెప్పేసింద‌ని స‌మాచారం. చూడాలి మ‌రి అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడొస్తుందో.