గంగా నదిలో తేలుతున్న ఫోటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ లో కొన్ని ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని గంగా నదిలో వదిలేయగా వాటిలో 70 కి పైగా మృతదేహాలను వెలికితీశారు. 100 కు పైగా మృతదేహాలను నదిలో వదిలేసినట్టు స్థానిక మీడియా చెప్తుంది. దీనితో గంగా నది నీటి ద్వారా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం మొదలయింది.
అయితే గంగా నదిలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు నిజంగా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారివేనా లేక ఎవరివి అయినానా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. చనిపోయిన వారిని గౌరవించే సాంప్రదాయం ఉన్న మన దేశంలో ఈ విధంగా జరగడం నిజంగా దారుణం. కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకు వెళ్ళకుండా వదిలేయడంతో నదిలో వదిలేస్తున్నారు.