నేను సీఎం అవుతా అంటూ 30 ఏళ్ళ క్రితం భార్యకు చెప్పాడు… నిజంగానే సిఎం అయ్యాడు…!

దాదాపు 30 సంవత్సరాల క్రితం అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తన భార్యకు ఇచ్చిన మాట ఇప్పుడు నెరవేర్చారు. 22 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తన భార్యకు నేను ఏదోక రోజు అసోం సిఎం అవుతా అంటూ మాట ఇచ్చారు. మీ అమ్మకు చెప్పండి నేను ఏదోక రోజు అసోం సిఎంగా ఉంటాను అంటూ అప్పుడు ప్రేమించిన తన భార్యకు చెప్పిన మాటలు ఇప్పుడు బాగా హైలెట్ అవుతున్నాయి.

హిమంత బిస్వా శర్మ భార్య రినికి భూయాన్ శర్మ ఈ విషయం బయటపెట్టారు. గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ్ కళాక్షేత్రంలో అస్సాం 15 వ ముఖ్యమంత్రిగా హిమాంత బిస్వా శర్మ మే 10 న ప్రమాణ స్వీకారం చేశారు . ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ వివాహం జరిగిందని ఇప్పుడు సిఎం అయ్యారని ఆయన భార్య తెలిపారు. హిమంత తన విద్యార్థి జీవితంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ లో కీలక పాత్ర పోషించారు.