మహేష్ బాబు బాటలోనే సాయి పల్లవి.. సంగతేంటంటే..?

-

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు డే షూటింగ్ ముగిసింది అంటే చాలు ఇంట్లో సినిమా ప్రస్తావన అనేదే ఉండదు. సెట్స్ లో ఉన్నంత సేపు మాత్రమే ఆయన హడావిడిగా కొనసాగుతారు. ఒకసారి ప్యాకప్ చెప్పేసారంటే ఇంటికొచ్చిన తర్వాత ఫ్యామిలీ తప్ప మరొక విషయం ఆయన మైండ్ లోకి కూడా రానివ్వరు ఇక ఈ విషయంలో మాత్రం మహేష్ బాబు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఒక్క కుటుంబంలోనే ఆ సంతోషం లభిస్తుంది అని.. అలాంటప్పుడు కోట్ల కంటే కుటుంబమే ముఖ్యమని ఆలోచించే వ్యక్తులలో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉంటారు.

ఇకపోతే కుటుంబం కోసం కుటుంబంతో సంతోషంగా గడపడం కోసం కొన్ని గంటలపాటు సినిమాకి దూరంగా ఉన్న తప్పు లేదని చెబుతూ ఉంటారు. ఇక కథల విషయంలో కూడా ఆయన వాటికంటూ ఒక కొంత ప్రత్యేకమైన సమయాన్ని కూడా కేటాయిస్తారు. అందుకే రియల్ లైఫ్ ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. మహేష్ బాబు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు బాటలోనే యంగ్ బ్యూటీ సాయి పల్లవి కూడా నడుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సాయి పల్లవి మాట్లాడుతూ.. పనిలో ఆనందాన్ని వెతుకుతున్నప్పుడు ఆ పని చాలా సంతృప్తిని ఇస్తుంది.. అలాగని దాన్ని జీవితంలోకి తీసుకురాకూడదు.. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూసినప్పుడే మనకు మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది. నేను ఏ సినిమా చేసినా సరే సాయంత్రం అయ్యేసరికి ఆ సినిమా షూటింగ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తాను. మళ్ళీ సినిమా అనే విషయాన్ని నా మైండ్ లోకి కూడా రానివ్వను . తిరిగి మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టే వరకు నా నిజ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. ఇక సెట్ లో అడుగుపెడితే వ్యక్తిగత జీవితం జోలికి కూడా వెళ్ళను అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా సాయి పల్లవి మహేష్ బాబు బాటలోనే నడుస్తూ స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతోందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news