స్టార్ హీరో మూవీకి నో చెప్పిన సాయి పల్లవి.. కారణం..?

-

ప్రముఖ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండే ఈమె పద్ధతికి చీర కట్టినట్టుగా తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. సాంప్రదాయంగా కనిపించి తన నటనతో మరింత మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేసింది. తక్కువ అయినప్పటికీ భారీ పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇకపోతే పాత్ర నచ్చితే ఎంతటి వరకు అయినా వెళ్లే ఈ ముద్దుగుమ్మ పాత్ర నచ్చకపోతే అవతల స్టార్ హీరో అయినా స్టార్ డైరెక్టర్ అయినా సరే నిర్మొహమాటంగా నో చెబుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సీనియర్ స్టార్ హీరోకి కూడా నో చెప్పిందట సాయి పల్లవి.

అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ చిత్ర సీమలో నటసింహంగా భారీ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న హీరో నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి చాలామంది రెడీ అవుతూ ఉంటారు. కానీ నాచురల్ స్టార్ సాయి పల్లవి మాత్రం నో చెప్పిందని సమాచారం. బాలయ్యతో నటించడానికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందని ఎంతో మంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటే.. ఈమె మాత్రం ఆయనతో నటించే అవకాశాన్ని వదులుకుంది.

ఇక అది ఏ సినిమా అంటే బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో ఈ ఏడాది మంచి విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో చెల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో థియేటర్లో ఈలలు వేయించింది. అయితే ఈ పాత్ర మొదట సాయి పల్లవి కే వరించిందట. గోపీచంద్ మలినేని మొదటిగా వరలక్ష్మీ పాత్ర కోసం సాయి పల్లవిని అడగగా నిర్మొహమాటంగా తిరస్కరించిందని సమాచారం. దీంతో గోపీచంద్ కూడా కాస్త ఫీల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ పాత్ర సాయి పల్లవి కంటే వరలక్ష్మికే బాగా సెట్ అయిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version