ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..2 పార్టులుగా సలార్ మూవీ!

-

వరుస సినిమాలతో ప్రభాస్‌ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే… ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా టీజర్ వచ్చేసింది. ప్రభాస్ మాస్ లుక్, బిజిఎం, ఎలివేషన్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ప్రశాంత్ నీల్ మరోసారి ఇండస్ట్రీని షేక్ చేస్తారని, ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడతారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ‘సలార్’ మూవీ టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. టీజర్ చూస్తే సలార్ సినిమాకు సీక్వెల్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. టీజర్ లో సలార్ : పార్ట్1-CEASEFIREఅని పేర్కొన్నారు. దీంతోపాటు పార్ట్-2 ఉంటుందని క్లారిటీ వచ్చింది. పార్ట్-1 సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కానుండగా, పార్ట్-2 పై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news