ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులు మంజూరు

-

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందింది. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులు మంజూరు చేసింది జగన్‌ సర్కార్‌. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్లూరి జిల్లాలోని పాడేరు, వైయస్సార్ జిల్లాలోని పులివెందుల, కర్నూలు జిల్లాలోని ఆదోని మెడికల్ కాలేజీల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం ఒక్కోచోట మెడికల్ కాలేజీకి 222, బోధనాస్పత్రికి 484 చొప్పున కొత్తగా 2,118 పోస్టులను సృష్టించగా… పోస్టులను మంజూరు చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వర్షాకాలంలోనూ గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మురుగు/వరద నీరు మళ్లింపు కాలువల తవ్వకం, బ్రిడ్జిలు, పైపు కల్వర్టుల పూడికతీత, రోడ్లు, నీటిపారుదల కాలువ వెంబడి మొక్కలు నాటడం, కొండలపై నుంచి పారే వర్షపు నీరు నిల్వకు వీలుగా ట్రెంచ్ ల నిర్మాణం వంటి 23 రకాల పనులను గ్రామీణ అభివృద్ధి శాఖ గుర్తించింది. ఇప్పటికే అనుమతి ఉన్న పనులతో పాటు ఈ పనులను కూలీలకు అప్పగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news