తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్‌’ టికెట్‌ ధరల పెంపు

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా ‘సలార్‌’. డిసెంబర్ 22న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలను చిత్ర నిర్మాతలు కోరగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తెలంగాణ మల్టీప్లెక్స్‌ల్లో రూ.100, సింగిల్‌ థియేటర్లలో రూ.65 పెంచుకునేలా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏపీలో టికెట్‌ ధరను రూ.40 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన రోజు (డిసెంబరు 22) నుంచి డిసెంబరు 28 వరకు టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ.. రాష్ట్రంలోని 20 థియేటర్లలో మాత్రమే అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్‌ షోకు అనుమతి ఇచ్చింది. సాధారణ ప్రదర్శనలతోపాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి ఆరో ఆట ప్రదర్శించుకోవచ్చని పంపిణీదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వుల్లో తెలిపింది.

ఏపీలో రూ.40 (సాధారణ థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో) పెంచుకునేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతిస్తూ.. సినిమా విడుదలైన పది రోజుల వరకే పెరిగిన ధరలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అదనపు షోలకు అనుమతి ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news