అంతర్జాతీయ స్థాయిలో ‘సలార్’..గుబురు గడ్డంతో ప్రభాస్ లుక్ లీక్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. అందుకు కారణం..ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన ఫైట్స్ లేకపోవడమే కారణమని తెలుస్తోంది. కాగా, నెక్స్ట్ ఫిల్మ్ ‘సలార్’లో మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని తెలుస్తోంది.

ఇకపోతే ఇందులో ప్రభాస్ లుక్ ఒకటి లీకయింది. ‘KGF’ చాప్టర్ 1, చాప్టర్ లోని రాఖీ భాయ్ అలియాస్ యశ్ మాదిరిగానే ప్రభాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది ప్రభాస్ లుక్. గుబురు గడ్డం, సూట్ లో ప్రభాస్ లుక్స్ మెస్మరైజింగ్ గా ఉంటాయని సమాచారం. ఇకపోతే ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవల్ లో ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ తెలిపారు. డెఫినెట్ గా పిక్చర్ కేజీఎఫ్ ను మించి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా తీసుకొచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే స్టోరిలో భాగంగా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయని సమాచారం. ఈ పిక్చర్ కూ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news