సల్మాన్ ఖాన్ @ 54.. సల్లూ భాయ్‌కి డబుల్‌ బొనాంజా

-

బాలీవుడ్‌ దబాంగ్‌, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ దబాంగ్‌ 3 సక్సెస్‌ను ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. మరోవైపు నేడు సల్మాన్‌ 54వ పుట్టినరోజును జరుపుకునేందుకు రెడీ అవుతున్నాడు. అయితే సల్మాన్‌కు ప్రతీ పుట్టినరోజు కన్నా ఈ సారి చేసుకోబోయే బర్త్‌ డే చాలా ప్రత్యేకమైంది. తన చెల్లెలు అర్పిత, తన భర్త ఆయుష్‌ శర్మలు సల్మాన్‌ పుట్టినరోజుకు ఇ‍వ్వబోయే బెస్ట్‌ గిఫ్ట్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే.. ఇప్పటికే నిండు గర్భవతైన అర్పితా, సల్మాన్‌ బర్త్‌డే రోజునే రెండో బిడ్డ‌కు జన్మనివ్వనుంది. దీంతో సల్మాన్‌ ఖాన్‌ ఖాందన్‌లో ఇప్పటికే డబుల్‌ సెలెబ్రెషన్స్‌ ప్రారంభమయ్యాయి.

సల్మాన్‌ ప్రతీసారి పన్వేల్‌ లోని ఫాంహౌస్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాడు. అయితే ఈ సారి మాత్రం సల్మాన్‌ సోదరుడు సోహైల్‌ ఖాన్‌ ఇంట్లో బర్త్‌ డే వేడుకలు జరుగనున్నాయి. సల్మాన్‌ ఖాన్‌ బర్త్‌ డే రోజునే డెలివరీ అయేలా అర్పితాఖాన్‌ ప్లాన్‌ చేసుకుంది. సల్మాన్‌ తమ్ముడు సోహైల్‌ ఖాన్‌ ఇంట్లో పార్టీ జరుగనుండడంతో.. బాలీవుడ్‌ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున బర్త్‌డే వేడుకలకు హాజరుకానున్నారు. ముఖ్యంగా కత్రినా కైఫ్, బాబీ డియోల్, పుల్కిత్ సామ్రాట్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు హాజ‌రుకానున్నారు.

ఇక 1965 డిసెంబరు 27న పుట్టిన సల్మాన్ ఖాన్ వయసు 54 యేళ్లు దాటినా ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా.. ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే కంటిన్యూ అవుతున్నాడు. ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్ బర్త్ డే విష్ చేయ‌డానికి బాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు, ష్యాన్స్‌ సోహైల్ ఇంటికి చేరుకున్నారు. మ‌రియు ఆయుష్ శర్మ, తుషార్ కపూర్, రవీనా ఠాండన్, సంగీతా బిజిలానీ, సమీర్ సోనీ, అతుల్ అగ్నిహోత్రి.. వీరంతా బాలీవుడ్ కండల వీరుడు, సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు బర్త్ డే విషేస్ చెప్పారు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా సల్లూ భాయ్‌కి విష్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news