మ‌రో సినిమాకు సీక్వెల్ తీయ‌డానికి సిద్ధ‌మైన స‌ల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ మ‌రో సినిమాను సీక్వెల్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నాడు. తాజా గా అందుకు సంబంధించిన అధికారిక ప్రక‌ట‌నను కూడా స‌ల్మాన్ ఖాన్ ప్ర‌క‌టించాడు. 2015 లో బాలీవుడ్ లో విడుదల అయి.. రికార్డుల‌ను కొల్లగొట్టిన బ‌జ‌రంగీ భాయిజాన్ అనే సినిమా కు సీక్వెల్ తీయ‌నున్న‌ట్టు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌క‌టించాడు. ఈ సీక్వెల్ కు బజ‌రంగీ భాయిజాన్ కు క‌థ అందించిన స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళీ తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాదే క‌థ అందిస్తున్నాడ‌ని ప్ర‌క‌టించాడు.

అయితే ఈ సీక్వెల్ సినిమా కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని స‌ల్మాన్ ఖాన్ తెలిపాడు. కాగ 2015 లో విడుద‌ల అయిన బ‌జ‌రంగీ భాయిజాన్ బాలీవుడ్ ను షేక్ చేసింది. బాలీవుడ్ చ‌రిత్రలో నే ఎక్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాలో లీస్ట్ లో బ‌జ‌రంగీ భాయిజాన్ ముందు వ‌ర‌స లో ఉంటుంది. అయితే ఈ సీక్వెల్ సినిమా కూడా అదే రెంజ్ లో ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. మొద‌టి సినిమా కు క‌థ అందించిన విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ సీక్వెల్ కు క‌థ అందించ‌డంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.