తెలంగాణలో నేడు జూనియర్ కాలేజీల బంద్

నాలుగు రోజుల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష ఫలితాలలో కేవలం.. 49 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మిగతా 51 శాతం తక్కువ మార్కులతో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీంతో 2018 పరీక్ష ఫలితాలు తరహాలోనే… ఇంటర్ బోర్డు పై.. ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది.

అటు ఫెయిల్ కావడంతో చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు తీర్పుకు వ్యతిరేకంగా డిసెంబర్ 20వ తేదీ అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీల బంద్ కు పిలుపునిచ్చింది ఎన్ఎస్ యు ఐ. విద్యార్థుల ప్రాణాలకు బాధ్యులైన తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు తీర్పుకు నిరసనగా ఈ బందులు విజయవంతం చేయాలని ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా విద్యార్థుల వ్యతిరేకత రావడంతో .. ఫెయిల్ అయిన విద్యార్థుల ను మినిమం పాస్ మార్కులతో… ఉత్తీర్ణులు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.