ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండే బాలీవుడ్ స్టార్ హీరోలు అతికొద్దిమందే ఉంటారు. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఈ ఏడాది రామ్‌సేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే రామ్‌సేతు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ‘రక్షాబంధన్’ ప్రమోషన్ సమయంలో స్టార్ హీరో అక్షయ్‌కుమార్ స్టేజ్‌పై కన్నీరు పెట్టుకోవడం తెలిసిందే. అప్పటి వీడియో సైతం వైరల్ అయింది. అయితే దీనిపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందించారు. సోషల్‌మీడియా వేదికగా ఈ వీడియో చూసిన ఆయన భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు.
”ఇప్పుడే సోషల్‌మీడియాలో ఈ వీడియో చూశాను. దీనిని అందరితో పంచుకోవాలనిపించింది. దేవుడి దీవెనలు నీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నా అక్కీ. నిజంగానే నువ్వు గొప్ప వ్యక్తివి. ఈ వీడియో చూసి నేనూ ఎమోషనల్ అయ్యాను. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. మరెన్నో సినిమాల్లో నటించాలి” అని సల్మాన్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దీనిపై అక్షయ్ ఆనందం వ్యక్తం చేశారు. ”నీ సందేశం నా హృదయాన్ని తాకింది. నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నువ్వు కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా” అని రిప్లై ఇచ్చారు.
చెల్లెళ్ల పెళ్లి చేయడం కోసం ఓ అన్నయ్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనే ఆసక్తికర అంశాలతో ‘రక్షాబంధన్’ తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాఖీ రోజున అక్షయ్ ఓ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఆసమయంలోనే అక్షయ్ సోదరి పంపించిన ఓ ఎమోషనల్ సందేశాన్ని షోలో ప్రసారం చేశారు. ”నాన్న చనిపోయిన తర్వాత ఇంటిల్లిపాదిని నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు. మాకోసం ఎంతో కష్టపడ్డావు. అన్నింటా అండగా నిలిచావు” అంటూ ఆమె మాటలతో సాగిన ఈ వీడియో చూసిన ఆయన కళ్లల్లో నీరు తిరిగాయి. తాజాగా ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా.. దాన్ని చూసిన సల్మాన్ ఈ విధంగా స్పందించారు.
ఇటీవల సల్మాన్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మలయాళం ‘లూసీఫర్’కి గాడ్ ఫాదర్ రిమేక్. మోహన్ లాల్ పాత్రలో తెలుగుతో చిరంజీవి కనిపించారు. మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం ఆకట్టుకుంది.