చైతు చేసిన ఆవ్యాఖ్యలు సమంతను ఉద్దేశించినవేనా.. !

నాగ చైతన్య, సమంత టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా ఉన్న వీరద్దరు విడాకులతో వేరయ్యారు. ఈ నిర్ణయంతో ఇద్దరి అభిమానులు షాక్ అయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత విడాకులకు కారణం ఒకరంటే ఒకరంటూ.. నెటిజెన్లు పలు కామెంట్లు చేశారు.

విడిపోయినప్పటి నుంచి సమంత సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక ఎమోషన్ పోస్ట్ పెడుతూ.. అభిమానులకు దగ్గరగా ఉంటోంది. అయితే సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడలేదు. సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు కూడా పెట్టలేదు..

తాజాగా.. ఓ ఇంటర్య్వూలో చైతు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు సమంతను ఉద్దేశించి చేసినవే అంటున్నారు నెటిజన్లు, అభిమానులు. ఇటీవల ఓ ఇంటర్ప్యూలో “ఏ పాత్రలు చేయడానికి మీరు ఇష్టపడరు?” అన్న ప్రశ్నకు చైతూ బదులిస్తూ.. “నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. అయితే అది వ్యక్తిగతంగా, కుటుంబం గౌరవానికి భంగం కలిగేలా ఉండకూడదు. అలాంటి పాత్ర, కథ నా దగ్గరికి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను” అన్నాడు. ఈ వ్యాఖ్యలు సమంతను ఉద్దేశించి చేసివే అంటున్నారు.

తాజాగా సమంత పుష్ప సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్ చేసింది. హాట్ లుక్స్ లో సమంత అభిమానులను ఫిదా చేస్తోంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలకు సమంత కమిట్ అయింది.