పాకిస్థానీ టెర్రిర‌స్టుగా స్టార్ హీరోయిన్‌!

-

ఓబేబీ, మ‌జిలీ చిత్రాల‌తో గ‌తేడాది వ‌రుస విజ‌యాల్ని ద‌క్కించుకుంది స‌మంత‌. అయితే ఆ త‌రువాత చేసిన `జాను` ఆమె ఉత్సాహాన్ని నీరుగార్చింది. త‌మిళ చిత్రం `96` ఆధారంగా తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు రీమేక్ చేశారు. ముందు భ‌యం భ‌యంగానే అంగీక‌రించిన సామ్‌కి త‌ను భ‌య‌ప‌డిందే జ‌రిగింది. `జాను`బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ కావడంతో కొన్ని రోజుల స‌మంత సైలెంట్ అయిపోయింది.

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటి ప‌ట్టునే వుంటు డాబాపై కూర‌గాయాలు పెంచి సెల‌బ్ర‌టీల‌తో పాటు అభిమానుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్ర‌స్తుతం `ఫ్యామిలీ మెన్` వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా వ‌స్తున్న `ఫ్యామిలీ మెన్ 2`లో న‌టిస్తోంది. ఇటీవ‌లే చిన్మయిని ప‌క్క‌న పెట్టి త‌న పాత్ర‌కు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్పుకుంది. టెర్ర‌రిజం నేప‌థ్యంలో అత్యంత స‌హ‌జ‌త్వంగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత పాకిస్థానీ టెర్రిరిస్ట్‌గా క‌నిపించ‌నుంద‌ని తెలిసింది. ఆమె మేకోవ‌ర్ కూడా ఇందులో కొత్త‌గా వుంటుంద‌ట‌. ఈ ఏడాది చివ‌రి నుంచి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.  ‌

Read more RELATED
Recommended to you

Latest news