కోవిడ్ వ్యాక్సిక్‌కు కేంద్రం వ‌ద్ద రూ.80వేల కోట్లు ఉన్నాయా..? సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో ప్ర‌శ్న‌..!

-

క‌రోనా వైర‌స్‌కు గాను ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా సంస్థ‌లు క‌లిపి రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భార‌త్‌లో పూణెకు చెందిన సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) టెస్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ కు గాను దేశంలో ప్ర‌స్తుతం ఫేజ్ 2, 3 క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కొన‌సాగుతున్నాయి. అయితే సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అద‌ర్ పూనావాలా తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో కేంద్రానికి ప్ర‌శ్న వేశారు.

Adar Poonawalla asked if center has 80000 crores for covid vaccine

కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశంలోని ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేసేందుకు కేంద్రం వ‌ద్ద రూ.80వేల కోట్లు ఉన్నాయా ? అని పూనావాలా ప్ర‌శ్నించారు. ఎందుకంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్ప‌టి నుంచే వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాల‌ని, అలా చేస్తేనే వ్యాక్సిన్ వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ఆల‌స్యం లేకుండా దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు.

కాగా సీర‌మ్ ఇనిస్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్‌ను భార‌త్ కోసం నెల‌కు 3 కోట్ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది. ఈ క్ర‌మంలో దేశం మొత్తానికి వ్యాక్సిన్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు క‌నీసం 2 ఏళ్ల స‌మ‌యం ప‌డుతుంది. అందుక‌నే వ్యాక్సిన్ పంపిణీ కోసం రోడ్ మ్యాప్ ఉండాల‌ని పూనావాలా అన్నారు. అయితే ప్ర‌ధాని మోదీ ఇప్ప‌టికే ఈ విష‌యంపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున ఆయ‌న మాట్లాడుతూ.. దేశంలో 3 వ్యాక్సిన్లు కీల‌క ద‌శ‌ల్లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్నాయ‌ని, వ్యాక్సిన్ రాగానే వెంట‌నే దేశంలోని ప్ర‌తి మూల‌లో ఉన్న పౌరుడికి వ్యాక్సిన్‌ను వేగంగా ప‌నిచేస్తామ‌ని, అందుకు కావ‌ల్సిన రోడ్ మ్యాప్‌ను ఇప్ప‌టికే సిద్ధంగా ఉంచామ‌ని.. మోదీ అన్నారు. అయితే తాజాగా పూనావాలా చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. ఇందుకు కేంద్రం ఏమ‌ని స‌మాధానం ఇస్తుందా.. అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news