ఫస్ట్ టైం విలన్ గా సమంత అక్కినేని ..!

-

సమంత అక్కినేని నాగ చైతన్య ని పెళ్ళి చేసుకున్నాక గ్లామర్ పాత్రలను పక్కన పెట్టింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలని, అలాగే కథా బలమున్న పాత్రలని ఎంచుకుంటూ సక్సస్ లని అందుకుంటుంది. మజిలీ, ఓ బేబి సినిమాలతో వరసగా రెండు హిట్స్ అందుకున్న సమంత జాను తో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకుంది. కాని ఆ సినిమా సమంతని నిరాశ పరచింది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

 

ప్రస్తుతానికి సమంత చేతిలో ఉంది ఆ ప్రాజెక్టే. అయితే మరోసారి భర్త నాగ చైతన్య తో కలిసి మజిలీ వంటి సినిమాలో నటించాలనుకుంటుంది. ఆ దిశగానే కథలను వింటుందట. అయితే ఈ లోపు ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది సమంత. ఇప్పటికే ఒక సిరీస్ కంప్లీట్ చేసుకున్న ఈ వెబ్ సిరీస్ దానికి కొనసాగింపుగా సీక్వెల్ ని రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ మాన్ సీజన్ వన్ వచ్చి మంచి ఆదరణని దక్కించుకుంది. మనోజ్ బాయ్ పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రలు పోషించారు.

ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్ ఫామిలీ మాన్ సీజన్ 2 లో ఆ ఇద్దరి తో పాటు సమంత నటిస్తోంది. అయితే ఇది ఒక ప్రయోగాత్మకమైన పాత్ర కాబట్టే సమంత ఒప్పుకుందట. అంతేకాదు మొదటిసారి ఈ వెబ్ సిరీస్ లో విలన్ పాత్రలో కనిపించనుందట. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీటయిందట. అక్టోబర్ లో ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేయనున్నారు. అయితే సమంత నెగిటివ్ రోల్ లో కనిపిస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక త్వరలో నిర్మాతగాను ప్రొడక్షన్ హౌజ్ ని ప్రారంభించి సినిమాలను నిర్మించాలనుకుంటున్నారట సామ్.. చై.

Read more RELATED
Recommended to you

Latest news