సమంత ఆస్తుల లెక్క ఇదే..!

-

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు అక్కినేని కోడలిగా మారాక కూడా వరుస సినిమాలు చేస్తుంది. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత 8 ఏళ్ల కెరియర్ లో భారీగానే సంపాదించింది. సినిమాకు 1 కోటి దాకా రెమ్యునరేషన్ తీసుకునే సమంత సంవత్సరానికి మూడు సినిమాల దాకా చేస్తుంది. వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా రెండు చేతులా సంపాదిస్తుంది.

ఇక ప్రస్తుతం సమంత మొత్తం సంపాదన మీద మీడియాలో ఓ టాక్ వినిపిస్తుంది. మొత్తంగా 100 కోట్లు దాకా కూడబెట్టిందట ఈ అక్కినేని కోడలు. ప్రస్తుతం మజిలి, ఓ బేబీ సక్కగున్నావే సినిమాల్లో నటిస్తుంది సమంత. ఇవే కాకుండా మరో రెండు సినిమాల్లో నటిస్తుంది సమంత. ఇక సమంత ఆస్తుల విషయానికొస్తే సమంతకు హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంది. దాని ధర 10 కోట్లు దాకా ఉంటుందట. ఇవే కాకుండా ఖరీదైనా ఫ్లాట్లు, అపార్ట్ మెంట్లు కూడా ఉన్నాయట. సో హీరోయిన్ గా సమంత సక్సెస్ అవండమే కాదు ఫైనాన్షియల్ గా కూడా స్ట్రాంగ్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version