బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత.. డెలివ‌రీ డేట్ కూడా ఫిక్స్‌..

-

అక్కినేని సమంత తల్లి కాబోతుందట. ఇదే విషయం సమంత తన ఇన్స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. విషయం ఏంటంటే.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ డెలివరీ డేట్‌ కూడా చెప్పేసింది.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో సమంత, నాగచైతన్యలది చూడముచ్చటైన జంట. ఎనిమిదేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వాస్త‌వానికి కెరియర్ ప్రారంభంలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే స‌మంత అక్కినేని ఇంటికి కోడలైనప్పటికీ గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గించలేదు. అదే గ్లామర్ తో అదే జోరుతో వరుస సినిమాలు చేసి భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంటోంది.

ఇదిలా ఉంటే.. పెళ్లై మూడేళ్లు అవుతున్నా వీరు ఇంకా పిల్లల గురించి ఆలోచించలేదు. ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలో పిల్లల గురించి సమంతపై ప్రశ్నల వర్షం కురిసింది. వీటికి ఆమె ఓపిగ్గా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చేవారు. ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడుతూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. అందులో భాగంగా ఓ నెటిజన్ సమంతను  మీరు ఎప్పుడు తల్లి కాబోతున్నారని ప్రశ్నించాడు.

దీనికి స‌మంత‌ కొంటెగా, కొంత వ్యంగ్యంగా సమాధానం ఇస్తూ.. 2022 సంవత్సరంలో ఆగస్టు 7వ తారీఖున ఉదయం 7 గంటలకు ఓ పాపకు జన్మనిస్తానని చెప్పింది. సమంత వ్యంగ్యానికి అంతా నవ్వుకున్నారు. అలాగే ఈ వీడియోను స‌మంత తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. కాగా, సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతున్నారు. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ హిట్ సినిమా ’96’ రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. తమిళ వర్షెన్‌ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది.

Read more RELATED
Recommended to you

Latest news