వామ్మో.. స‌మంత డ్యాన్స్ మామూలుగా లేదుగా..!

-

టాలీవుడ్ అగ్ర‌న‌టుల్లో ఒక‌రైన స‌మంత ఇప్పుడు పుల్ జోష్ మీద క‌నిపిస్తోంది. త‌న లేటెస్ట్ ఫోటోలు, మోటివేష‌న‌ల్ కొటేష‌న్స్‌, సినిమాల అప్‌డేట్స్ ఇలా షేర్ చేస్తూ.. నెట్టింట్లో ర‌చ్చ చేస్తుంది. ఇటీవ‌ల వ‌ర్క‌వుట్ వీడియోస్ షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌కు ఛాలెంజ్ చేసిన విష‌యం తెలిసిన‌దే. స‌మంత విసిరిన ఛాలెంజ్‌కు అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సామ్ బాట‌లోనే టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహేగ్దే సైతం త‌న ఫాలోవ‌ర్ల‌కు కొత్త ఛాలెంజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి.. పూజా హేగ్దే జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బీస్ట్‌.. ఈసినిమా నుంచి వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా అర‌బిక్ కుతు అనే పాట‌ను విడుద‌ల చేశారు. విడుద‌లైన కొన్ని గంల్లోనే ఈ పాటకు భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. హీరో శివ‌కార్తీకేయ‌న్ సాహిత్యం, సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ అందించిన సంగీతం ఈ పాట‌కు హైలెట్ అయ్యాయి. ఇటీవ‌లే మాల్దీవుల‌లో పూజా హేగ్దే ఈ పాట‌కు స్టెప్పులేస్తూ నెటిజ‌న్లు సైతం త‌న‌లాగే డ్యాన్స్ చేయాల‌ని స‌వాలు చేసింది. పూజా హేగ్దే ఛాలెంజ్‌కు స‌మంత రిప్లై ఇచ్చింది.

ఎయిర్ పోర్టులో అర‌బిక్ కుతు పాట‌కు డ్యాన్స్ చేస్తున్న వీడియోను త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది. అర్థరాత్రి విమానం ఆల‌స్యం.. ఈ రాత్రికి రిథ‌మ్ అరబిక్ కుతు.. అంటూ సమంత క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. స‌మంత షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజ‌న్ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ప్ర‌స్తుతం సామ్ య‌శోధ సినిమా చేస్తున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news