సిటాడెల్ షూటింగ్ సెట్లో కళ్లు తిరిగిపడిపోయిన సమంత

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే మయోసైటిస్ నుంచి కోలుకుని మెల్లగా వర్క్ మోడ్లోకి వచ్చేసింది. ఇండియన్ వెర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతోంది. మరోవైపు హెల్త్ పాడ్కాస్ట్ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో తను ఎదుర్కొన్న శారీరక కష్టాల్ని, రుగ్మతల్ని మరోసారి గుర్తు చేసుకుంటోంది.

ఆ మధ్య మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సామ్ ఆ బాధను భరిస్తూనే సిటాడెల్ షూటింగ్లలో పాల్గొందట. అయితే ఈ షూటింగ్ సమయంలో కొన్ని సార్లు తనకు తల తిరగడం, మరికొన్నిసార్లు మూర్ఛపోవడం లాంటివి జరిగాయట. ప్రతి ఒక్కరికీ జీవితంలో చీకటి రోజులు అనేవి ఉంటాయని అంటున్న సామ్.. వాటిని భరించి ఓర్పుతో ముందుకెళ్తేనే కెరీర్‌ చాలా అందంగా ఉంటుందని చెబుతోంది. మయోసైటిస్ సమస్య వల్ల సిటాడెల్‌ షూటింగ్ ఎంతో క్లిష్టంగా అనిపించిందని, శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటకీ, సిరీస్లో చాలా యాక్షన్‌ సీన్స్ ఉంటాయని తెలిసినా ఒప్పుకున్నానని తెలిపింది. ఒకరోజు యాక్షన్‌ సీన్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తనలో శక్తి నశించి, చాలా నీరసంగా అయిపోయి స్పృహ తప్పి కూడా పడిపోయానని చెప్పుకొచ్చింది ఈ భామ.

Read more RELATED
Recommended to you

Latest news