ఫ్యాన్స్‌కు స‌మంత గుడ్‌న్యూస్‌.. డేట్ ఫిక్స్ చేసిందిగా!

ఏమాయ చేసావే సినిమాతో అంద‌రినీ మాయ చేసేసింది స‌మంత‌. క్యూట్ స్మైల్‌తో అంద‌రినీ ప‌డ‌గొట్టేసింది. ఈగ సినిమాతో ఓవ‌ర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. వ‌రుస‌గా టాలీవుడ్‌, కోలీవుడ్ స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక నాగచైత‌న్య‌ను పెళ్లి చేసుకుని సినిమాలు కాస్త త‌గ్గించింది.

 

అయితే సినిమాల‌కు ధీటుగా వెబ్‌సిరీస్‌లు ఉండ‌టంతో స‌మంత అటువైపు అడుగులేస్తోంది. ఇప్ప‌టికే ఫ్యామిలీ మ్యాన్ అనే పాపుల‌ర్ వెబ్‌సిరీస్‌లో న‌టించి మెప్పించింది. ఈ ఫ‌స్ట్ పార్ట్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇప్పుడు రెండో పార్ట్ కూడా షూటింగ్ జరుగుతోంది.

దీంట్లో స‌మంత రాజీ అనే పాత్ర‌లో ఇర‌గ‌దీయ‌నుంది. టెర్ర‌రిస్టుగా అంద‌రినీ మెస్మ‌రైజ్ చేస్తుందంట‌. దీని పోస్ట‌ర్ కూడా విడుద‌లై వైర‌ల్‌గా మారింది. ఇక దీని స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి స‌మంత్ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 11నుంచి అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌ల‌వుతుంద‌ని చెప్పింది. దీంతో అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మ‌రి ఈ రెండో పార్ట్ ఎంత కిక్ ఇస్తుందో చూడాలి.