అక్షయ తృతీయ నాడు ఈ తప్పులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి…!

ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 14 శుక్రవారం నాడు వచ్చింది. ఈరోజు లక్ష్మీ దేవికి పూజ చేయడం చాలా మంచిది. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సంవత్సరమంతా కూడా ఆశీస్సులు ఉంటాయని కష్టాలు పోతాయని భక్తుల నమ్మకం.

అయితే అక్షయ తృతీయ నాడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు అని పండితులు చెప్తున్నారు. కనుక ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థికంగా నష్టం ఉండదు. లక్ష్మీ దేవికి శుభ్రంగా ఉంటే ఇష్టం. కాబట్టి మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. అలానే అక్షయ తృతీయ నాడు ఇతరుల తో గొడవ పెట్టుకోకండి. మంచిగా ప్రేమగా ఉండండి. ఎక్కడైనా గొడవలు, కోపాలు ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉండదు.

తులసి మొక్క అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అక్షయ తృతీయ నాడు చాలా చోట్ల తులసి మొక్కని పూజిస్తారు. కాబట్టి అక్షయ తృతీయ నాడు తులసీదళాలని విరవడం, స్నానం చేయకుండా ముట్టుకోవడం లాంటి తప్పులు చేయొద్దు.

స్నానం చేసి తులసి మొక్క దగ్గర పూజించడంవల్ల లక్ష్మీ దేవి వస్తుంది. అక్షయ తృతీయ అంటే నిజంగా మంచి రోజు. ఆరోజు ఏ శుభకార్యం తలపెట్టినా తప్పక మంచి జరుగుతుంది కాబట్టి బంగారం కొనడం ఇళ్లస్థలాలు కొనడం లాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు.