ఆ పోస్టుకు సమంత లైక్.. విడాకుల కారణంపై నెట్టింట మళ్లీ చర్చ

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యమా యాక్టివ్. అయితే తాజాగా నెట్టింట ఆమె ఒక పోస్టును లైక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవడానికే భర్త మొగ్గు చూపుతున్నారనే సర్వే గురించి ఉన్న ఓ పోస్ట్‌ను సామ్ లైక్ చేసింది. దీంతో ఇప్పుడు మళ్లీ సమంత-నాగచైతన్య విడాకుల గురించి చర్చ మొదలైంది. సామ్ అనారోగ్యం వల్లే చైతన్య విడాకులు ఇచ్చారంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సక్సెస్‌ వెర్స్‌ అనే ఇన్‌స్టా ఖాతాలో తాజాగా భార్య అనారోగ్యానకిి గురైతే భర్త వదిలేసేందుకే మొగ్గు చూపుతున్నాడని.. అదే మహిళలు మాత్రం భర్త ఆరోగ్యం బాలేకపోతే మరింత శ్రద్ధగా అతణ్ని చూసుకునేందుకు ముందుకు వస్తున్నారంటూ ఓ పోస్టు చేసింది. భార్యతో ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ లేకపోవడం వల్లే భర్త ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని తాము చేసిన సర్వేలో తేలిందని ఈ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టును సమంత లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news