గుణ శేఖర్ ది మంచి ఛాయిస్సే.. శాకుంతలంలో సమంత..

-

రుద్రమదేవి సినిమా తర్వాత రానాతో హిరణ్య కశ్యప తెరకెక్కించాలని చూసిన గుణ శేఖర్, ఆ సినిమాని పక్కన పెట్టి కొత్త సినిమా ప్రకటించాడు. శాకుంతలం అనే పేరుతో పాన్ ఇండియా రేంజిలో సినిమా తెరెకెక్కిస్తున్నానని ప్రకటించాడు. ఐతే హీరో ఎవరు, హీరోయిన్ ఎవరనే విషయాలు వెల్లడించలేదు. ప్రస్తుతం నూతన సంవత్సరం సందర్భంగా శాకుంతలం సినిమా మీద అప్డేట్ తో వచ్చాడు. శాకుంతలం సినిమాలో సమంత నటిస్తుందని ఆ అప్డేట్ సమాచారం.

తెలుగులో టాప్ లో ఉన్న సమంత, పాన్ ఇండియా లెవెల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట. నీలిమా గుణ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణ శేఖర్ స్వయంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలియదు. శాకుంతలం అన్న టైటిల్ కారణంగా, ప్రబంధాన్ని తెరపైకి తీసుకొస్తున్నారేమో అని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే, శాకుంతలం సినిమా మరో రేంజిలో ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news