పుట్టు వెంట్రుకలు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలు ఇవే…!

-

మనం ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని పద్ధతులని అనుసరిస్తున్నా… వాటి వెనుక ఉన్న కారణాలు మనకి తెలియవు. కానీ తెలుసుకుంటే మనం రాబోయే తరాల వాళ్ళకి కూడా చెప్పగలం. ఇటువంటి మన ఆచార వ్యవహారాల్లో ఎన్నో రహస్యాలు మరియు తెలియని విషయాలు దాగి ఉన్నాయి. అయితే మనం అనేక ఆచారాల్ని పాటిస్తాము. మనిషి పుట్టినప్పటి నుండి కూడా అనేక వాటిని జరుపుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఇలా ఉండగా దేవునికి మనం పుట్టు వెంట్రుకలు ఎందుకు ఇస్తామని విషయం మీకు అందరికీ తెలియకపోవచ్చు. మరి దానికి గల కారణం ఇదే మరి చూసేయండి.

దేవునికి మనం పుట్టు వెంట్రుకలు ఎందుకు ఇస్తాము అన్న విషయానికి వస్తే… వాస్తవంగా చూస్తే దేవునికి తల నీలాలను ఇవ్వడం అనేది నిన్న మొన్న వచ్చినది ఏ మాత్రం కాదు. మనం పూర్వం నుండి దీనిని చూస్తున్నదే. ఇది నిజంగా మనం ఆచరిస్తున్న గొప్ప సంప్రదాయం. ఎక్కువగా తిరుమల దేవునికి కల్యాణ కట్ట లో భక్తులు తల వెంట్రుకలను సమ్పరిస్తారు. అయితే మన తల వెంట్రుకలను మన పెద్ద వారు పాపాలకు ప్రతిరూపాలుగా చెప్పేవారు. ఇది అనేక సార్లు మనం విన్నదే. అయితే ఈ తల నీలాలను ఇవ్వడం ద్వారా మన పాపాలను పోగొట్టుకోవడమే అంటున్నారు.

మొదట శిశువుకు పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక విషయ వాసన వలన పాపాలు అనేవి తల జుట్టుకు అట్టిపెట్టుకుని వుంటాయి. అందుకే చిన్న వయసులోనే వారికి కేశ ఖండన కార్యక్రమాన్ని జరుపుతారు. మనము మన జన్మకు కారణమయిన భగవంతునికి శిరస్సును అర్పించడం వీలు పడదు కాబట్టి, శిరోజాలను ఇస్తామని కూడా చెబుతూ ఉంటారు. చూసారా మన పద్ధతుల్లో, ఆచారాల్లో ఎంత రహస్యం దాగి ఉందో..!

Read more RELATED
Recommended to you

Latest news