SAMANTHA : నాగ చైతన్య క్యారక్టర్‌ పై సమంత సంచలన వ్యాఖ్యలు

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది.

ఇక పోతే.. విడాకులు తీసుకున్న అనంతరం.. నాగ చైతన్య క్యారక్టర్‌ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తన వద్ద డబ్బులు లేని సమయంలోనూ తనకు చైతూ అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది సమంత.

” ఒకానొక సమయంలో.. నేను చైతన్యతో కలిసి షూటింగ్‌ చేసేటప్పుడు నా దగ్గర కనీసం అమ్మకు కాల్‌ చేసి మాట్లాడటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నా పరిస్థితిని అర్థం చేసుకున్న చైతన్య… వెంటనే నా దగ్గరకు తన ఫోన్‌ ఇచ్చి.. ఎంతసేపైనా మాట్లాడమని చెప్పాడు. చైతన్య ఫర్‌ ఫెక్ట్‌ జెంటి మ్యాన్‌.. ఫైనాన్షియల్‌ గా చైతు నన్ను ఆదుకున్నాడు” అని సమంత చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news