అవి చూపిస్తూ అలాంటి ఫోటో షేర్ చేసిన సమంత.. షాక్ లో ఫ్యాన్స్…!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి మరింత హాట్ టాపిక్ గా నిలిచింది. ఏ మాయ చేసావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు తొలిచూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హోదాకు చేరుకుంది. మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగింది. సొంతంగా వ్యాపారాలు కూడా మొదలుపెట్టింది.

నటుడు సిద్ధార్థ తో ప్రేమాయణం చేసి కొన్ని కారణాల తర్వాత బ్రేకప్ చెప్పిన ఈమె.. ఆ తర్వాత తనతో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా తన భర్త నాగ చైతన్యతో సినిమాలలో నటించి.. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల విడిపోయారు. పెళ్లి తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లుగా బ్రతుకుతున్నారు. నాగచైతన్య మెల్లి మెల్లిగా కెరియర్ ను ముందుకు కొనసాగిస్తుండగా.. సమంత మాత్రం జెడ్ స్పీడ్ లో దూసుకుపోతోంది.

ఇలా ఉండగా తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పంచుకుంది. అందులో అమ్మాయి నడుము , థైస్ మధ్య ఉన్న భాగాన్ని నగ్నంగా చూపిస్తూ ఆ ఫోటోను షేర్ చేసింది.. అయితే ఈ ఫోటోలో నడుము కింద ఉన్న చారలను ప్రత్యేకంగా చూపిస్తూ.. ఒక విషయాన్ని పంచుకుంది. ఈ అసంపూర్ణమైన ప్రపంచంలో ఆమె పర్ఫెక్ట్ గా లేకున్నా కూడా పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పుకు వచ్చింది అంటే ఆమె అలా ఉన్నా కూడా పర్ఫెక్ట్ గా ఉంది అని అర్థం.. దీంతో ఈ స్టోరీ చాలా వైరల్ అవుతుంది.