సమంత సినిమాకు ‘A’ సర్టిఫికెట్.. పోర్న్ స్టార్ గా నటించడమే కారణమా..!

-

మొన్నటిదాకా సింగిల్ గా ఉన్న సమంత ఇప్పుడు అక్కినేని ఇంట కోడలిగా మారింది. సమంత అక్కినేనిగా పేరు మారింది తప్ప హీరోయిన్ గా తన ఫాం కొనసాగిస్తూనే ఉంది.

పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న సమంత వారం గ్యాప్ లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో ఒకటి తమిళ సినిమా సూపర్ డీలక్స్ కాగా.. రెండోది తెలుగులో వస్తున్న మజిలీ.విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా నటిస్తూ ప్రయోగాత్మకంగా వస్తున్న సినిమా సూపర్ డీలక్స్. ఈ సినిమాలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ గా నటిస్తుంది. సమంత కూడా మధ్య తరగతి మహిళ పాత్రలో కనిపిస్తుంది.



సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. U/A కాకుండా కేవలం ‘A’ ఇచ్చారు అంటే ఇది కేవలం పెద్దవాళ్లకు మాత్రమే అన్నమాట. మార్చి 29 శుక్రవారం రిలీజ్ అవుతున్న సూపర్ డీలక్స్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news