దాన్ని లాయర్ నోటరీ కూడా చేశారట. అయితే.. తన పరిధిలోకి రాని గ్రామాన్ని నోటరీ ఎలా చేస్తారంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
ఏపీ సీఎం చంద్రబాబు కొడుకు, మంత్రి నారా లోకేశ్ నామినేషన్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఆయన సమర్పించిన నామినేషన్ల పేపర్లలో దొర్లిన తప్పులే అందుకు కారణమట. అవును.. అందుకే ఆయన నామినేషన్ ను ఎన్నికల అధికారులు ఆమోదిస్తారా? లేదా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మంగళగిరి అభ్యర్థిగా నామినేషన్ వేసిన లోకేశ్.. తన ఇంటి అడ్రస్ ను తాడేపల్లి మండలం ఉండవల్లిగా పేర్కొన్నాడట.దాన్ని లాయర్ నోటరీ కూడా చేశారట. అయితే.. తన పరిధిలోకి రాని గ్రామాన్ని నోటరీ ఎలా చేస్తారంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దానిపై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని నోటరీ చేసిన లాయర్ రిటర్నింగ్ అధికారికి తెలిపారు.
అయితే.. నోటరీ రూల్స్ ప్రకారం.. ఆ నామినేషన్ చెల్లదంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతే కాదు.. లోకేశ్ తప్పుడు నామినేషన్ పత్రాలను సమర్పించారని… చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ దీనిపై కఠినంగా ఉండాలన్నారు. అయితే.. ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడులు వచ్చి లోకేశ్ నామినేషన్ ను ఆమోదించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.