హైదరాబాద్ కి ఇక సెలవు అంటున్న సమంత..!

టాలీవుడ్ స్టార్ నటి సమంత గత ఏడాది యశోద సినిమాతో మెప్పించారు. మయోసిటీస్ వ్యాధిబారిన పడిన ఈమె పూర్తిగా కోలుకున్నాక సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొనడంతో పాటు హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో కూడా వరుణ్ ధావన్ పక్కన సందడి చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శాకుంతలం సినిమా కూడా ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా అది కాస్త ఇప్పుడు వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా మేకర్స్ వెల్లడించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మిగతా సినిమా షూటింగ్ లపై ఆమె దృష్టి పెడుతున్నట్లు సమాచారం.

తాజాగా వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిటాడెల్ షూటింగ్ నిమిత్తం సమంతా ఎక్కువ రోజులు ముంబైలో ఉండవలసి వస్తుండడంతో అక్కడ ఇల్లును కూడా కొనుగోలు చేయాలని.. ఆమె భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే రూ. 15 కోట్ల విలువైన విలాసవంతమైన ప్లాట్ ని కూడా చూశారని.. దాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. గతంలో కూడా ఆమెపై ఇలాంటి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఆమె ముంబైకి మకాం మార్చాలని అనుకుంటున్నట్లు అక్కడే ఒక విలాసవంతమైన ఫ్లాట్ ని కూడా కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి..

కానీ తనకు హైదరాబాద్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉందని తాను ఇక్కడి నుంచి వెళ్ళనని చెప్పకనే చెప్పేశారు.. కానీ ప్రస్తుతం సిటాడెల్ సినిమా కోసం అక్కడే కొద్ది రోజులు ఉండాల్సి వస్తుంది కాబట్టి సమంత ముంబైకి మకాం మారుస్తున్నారని తెలుస్తోంది. మరి సమంత హైదరాబాద్కు పూర్తిగా సెలవు తీసుకుంటుందా లేక సిటాడెల్ షూటింగ్ పూర్తవగానే వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?