“మగరాయుడి”లా మారనున్న హీరోయిన్ సమంత !

-

విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది సమంత. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది. అటు వరుస సినిమాలు సైన్‌ చేస్తూనే ముందుకు వెళుతోంది సామ్‌.

ఫ్యామిలీ మ్యాన్ 2 రేప్ సిరీస్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత… అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇదిలా ఉండగా తాజాగా మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది సమంత.

బాలీవుడ్ హీరో వరుణ్ధావన్ నటించనున్న ఈ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అమెరికాకు చెందిన పాపులర్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ లో సమంత, వరుణ్ నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉన్నాయని సమాచారం. దీంతో సమంత ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందని తెలుస్తోంది. ఇందుకోసం సమంత ఇప్పటికే చాలా కసరత్తులు ప్రారంభించింది. తరచూ తన సోషల్ మీడియాలో… కసరత్తులు చేస్తున్న ఫోటోలను కూడా పెట్టిన సంగతి తెలిసిందే. మొత్తానికి హీరోయిన్ గా ఉన్న సమంత.. మగరాయుడిలా మారబోతుందట్టు కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news