KNR: రేషన్ లబ్దిదారులకు సర్వర్ సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 4 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో రేషన్ దారులు వరుసలో నిలబడి తమ వంతు కోసం వేచి చూడాల్సి వస్తోంది. అసలే సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో బియ్యం కోసం ఎగబడుతున్నారు. జిల్లాలో 487 చౌక ధరల దుకాణాలు ద్వారా 2,75,313 మంది లబ్ధిదారులకు ప్రతినెలా సుమారు 1800 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో నిలిచిన రేషన్ బియ్యం సరఫరా
-