మోదీ, బీజేపీపై సమంత షాకింగ్ కామెంట్స్.. నెటిజన్స్ ఆగ్రహం.!

-

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మోదీ పై అలాగే బిజెపి పార్టీపై చేసిన కామెంట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత బిజెపికి , ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి తన మద్దతు అంటూ కామెంట్లు చేసింది. దీంతో గతంలో కూడా సమంత మోదిపై చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియోలు ప్రముఖ క్రికెట్ అమిత్ కుమార్ షేర్ చేశాడు. ఇకపోతే ఈ వీడియో పై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తూ సమంతను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఒక వీడియోలో సమంత మాట్లాడుతూ.. నేను ఎప్పుడు మోదీజీ సపోర్టర్ ని..ఆయన చేసే కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నాను అంటూ వ్యాఖ్యానించింది..Samantha is always a Modi supporter.. ? Open Talk..ఇక ఇంకొక వీడియోలో.. నేను మోడీ సపోర్టర్.. ఎందుకంటే ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని నమ్ముతున్నాను. ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తారు.. ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకొస్తారు అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే మోడీ ప్రస్తుత నిర్ణయాలు నేపథ్యంలో ఆమె పాత కామెంట్స్ ను నేటిజన్ లు వైరల్ చేస్తూ.. ఆమెను ట్రోల్ చేస్తున్నారు.. ఎల్పిజి సిలిండర్ 1100 రూపాయలు అయింది .. ఆర్థిక వ్యవస్థలో మార్పు అంటే ఇదేనా అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు, నిర్ణయాలపై అసహనంతో ఉన్న కొంతమంది నేటిజెన్లు దానిని ఇప్పుడు సమంతా పై వెళ్లగక్కుతూ కామెంట్స్ రూపంలో ట్రోల్ చేస్తున్నారు.ఈ విషయంపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది..ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఖుషి, శాకుంతలం, యశోద , అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ వంటి చిత్రాలలో ఉండగా శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అంతే కదా సమంత మరో వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి సిద్ధమైందని అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news