యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘డాంగ్ డాంగ్’ ఫుల్ సాంగ్…..!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి ల కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ పై ప్రేక్షకులుతో పాటు ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా జతకడుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన నాలుగు లిరికల్ సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ మంచి సక్సెస్ సాధించి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా నుండి డాంగ్ డాంగ్ అనే పార్టీ సాంగ్  వీడియో ప్రోమోని మొన్న సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.

సైనికుల మధ్యన మహేష్ బాబు, తమన్నా కలిసి ఎంతో సరదాగా చిందేసిన ఈ పార్టీ సాంగ్ ప్రోమోకి శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. కాగా ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. యువ సింగర్స్ నకాష్ అజిజ్, లావిట లోబో కలిసి ఎంతో అద్భుతంగా పాడిన ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ట్యూన్ తో పాటు రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం సాంగ్ ని మరింతగా సక్సెస్ చేసాయి. ఇక ఈ సాంగ్ మంచి జోష్ తో సాగడంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్ లో మహేష్ బాబు,

 

తమన్నాలు స్టెప్స్ ని అదరగొట్టినట్లు మొన్న రిలీజ్ అయిన వీడియో ప్రోమోని బట్టి చూస్తుంటే తెలుస్తోంది. ఈ సాంగ్ తో పాటు తప్పకుండా మిగతా సాంగ్స్ అన్ని కూడా థియేటర్లో ఎంతో బాగుంటాయని, అలానే సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవుతుందని సరిలేరు నీకెవ్వరు మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి…..!!

Read more RELATED
Recommended to you

Latest news