మనలోకం స్పెషల్ :: విడుదలకి ముందే ‘సరిలేరు నీకెవ్వరు’ .. ట్రెయిలర్ రివ్యూ !!

-

 

మహేశ్ బాబు హీరో గా వచ్చే ఏ సినిమా ఐనా ప్రేక్షకులకి విపరీతమైన ఆసక్తి ఉంటుంది. మహేశ్ అంటే ఫామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి , యూత్ , స్టూడెంట్స్ తో పాటు ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఎగబడతారు .. ఇప్పటికే టీజర్ , సాంగ్స్ తో ఇరగదీస్తున్న ఈ సినిమా బృందం – ట్రెయిలర్ తో ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుంది అనేది ఆసక్తికరం. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా మీద డిస్ట్రిబ్యూటర్ లు విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు.

 

మహేశ్ బాబు గత మూడు చిత్రాలు కమర్షియల్ గా హిట్ అయినా కూడా మహేశ్ ని అనిల్ కొత్తగా చూపిస్తాడు అనే నమ్మకం ప్రేక్షకుల కి ఉండడం తో , ఈ సినిమా బ్లాక్ బుస్టర్ గా నిలిచి తమకి ఎక్కువ లాభాలు ఇస్తుంది అనే ఫీలింగ్ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.

 

 

మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఉభయ గోదావరి జిల్లాలకి చెందిన ఒక ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ కి ఈ సినిమా ప్రొడ్యూసర్ లు ఈ ట్రెయిలర్ ఇప్పటికే చూపించారు అని టాక్ నడుస్తోంది. ఆ డిస్ట్రిబ్యూటర్ చెబుతున్న లెక్క ప్రకారం ఔట్ అండ్ మాస్ యాటిట్యూడ్ తో మహేశ్ కనిపిస్తాడట .. ట్రైన్ సీన్ లతో సహా కామెడీ అండ్ ఫామిలీ సీన్ లు కూడా ఏ రేంజ్ లో ఉంటాయో అనిల్ రావిపూడి ట్రెయిలర్ లోనే చూపించాడు అని తెలుస్తోంది. ఆఖర్లో వచ్చే డైలాగ్ సోషల్ మీడియా లో వైరల్ అవడం పక్కా అని చెబుతున్నారు .. ఏదేమైనా ఈ సంక్రాంతి కి బాబు బ్లాక్ బుస్టర్ కొట్టడం పక్కా అనేది ఈ ట్రెయిలర్ చూసి చెప్పేస్తారు ప్రేక్షకులు అని భోగట్టా !!!

Read more RELATED
Recommended to you

Latest news