గాయకుడిగా సత్యదేవ్ నయా అవతార్..వినూత్నంగా ‘గాడ్సే’ ప్రమోషన్స్

-

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్..ఓ వైపు తను కథానాయకుడిగా సినిమాలు చేస్తూనే మరో వైపున పలు సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్.

‘బ్లఫ్ మాస్టర్’ ఫేమ్ గోపీ గణేశ్ దర్శకత్వంలో సత్యదేవ్ నటించిన చిత్రం ‘గాడ్సే’. ఈ నెల 17న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ నెల 7న ఈ సినిమా నుంచి ‘రారమ్మంది..ఊరు’ అనే సాంగ్ రిలీజ్ కానుంది. రామ్ మిరియాల ఆలపించిన ఈ పాటను ప్రమోట్ చేయడం కోసం సత్యదేవ్ తానే గాయకుడిగా కొద్దిసేపు అవతారమెత్తాడు.

‘రారమ్మంది..ఊరు’ అనే సాగే పాటలోని మొదటి రెండు చరణాలను పాడి వినిపించాడు. ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేయగా, సదరు వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సి.క‌ల్యాణ్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ లో ఫిమేల్ లీడ్ రోల్ మాలీవుడ్ (మలయాళ) భామ ఐశ్వర్య ప్లే చేసింది.

నాగబాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, సినిమా చాలా బాగుంటుందని మేకర్స్ చెప్తున్నారు. సత్యదేవ్ ఇటీవల విడుదలైన మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రంలో కనిపించారు. ‘గాడ్ ఫాదర్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’లోనూ సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news