హీరో సుమంత్ కు రెండో పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా…?

-

హీరో సుమంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని మేనల్లుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో సుమంత్‌. అలాగే… గోదావరి, మధుమాసం, గౌరీ సినిమాలతో క్రేజ్‌ పెంచుకున్నారు హీరో సుమంత్‌. అయితే ఆ తర్వాత… ఆయనకు విజయం దక్కలేదు. ఇది ఇలా ఉండగా.. హీరో సుమంత్‌ కి పెళ్లి నిశ్చయమైంది.

వైవిధ్యమైన సినిమాలతో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుమంత్‌ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయిని సుమంత్‌ పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు సుమంత్‌- పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లి పత్రిక నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. మరోవైపు సుమంత్‌కు హీరోయిన్‌ కీర్తిరెడ్డితో గతంలోనే పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సుమంత్‌ రెండో పెళ్లికి రెడీ అయ్యారు.కాగా.. ప్రస్తుతం… హీరో సుమంత్‌.. అనగనగా ఒక రౌడీ సినిమాలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news