Sekhar Kammula: రానా కు షాకిచ్చినా శేఖ‌ర్ క‌మ్ముల ! మ‌రో స్టార్ హీరో ‘లీడర్’ సీక్వెల్ !

-

Sekhar Kammula: శేఖ‌ర్ క‌మ్ముల తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సెన్సెబుల్ డైరెక్ట‌ర్. మంచి కాఫీలాంటి సినిమాలను అందించ‌డంలో ఆయ‌నది అందె వేసిన చేయి. అందమైన ప్రేమకథలను.. సున్నితంగా తెరకెక్కిస్తారు ఆయ‌న‌.ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సినిమాలు తీయడంలో శేఖర్ దిట్ట అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇటీవలే.. నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ”. సెప్టెంబర్ 24 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన లవ్ స్టోరీ.. ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. హిట్ టాక్ సంపాదించుకుంది. బాక్స్ ఆఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇటీవల శేఖర్ కమ్ముల ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ.. త‌న నెక్ట్ ప్రాజెక్ట్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. దగ్గుబాటి హీరో రానా నటించిన మొదటి సినిమా లీడర్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి విజ‌యం ద‌క్కించుకుందో అంద‌రికి తెలుసు. అయితే.. ఈ లీడర్ సినిమాకు స్వీక్వెల్ తప్పకుండా తెరకెక్కిస్తానని శేఖ‌ర్ తెలిపారు. అయితే.. ఈ చిత్రంలో రానాను ప‌క్కా పెట్టి.. ఓ స్టార్ హీరోతో చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రూ? ఎందుకు ఆ స్టార్ హీరోతోనే ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు అనే విష‌యాలు ఆసక్తి క‌రంగా మారాయి.

ఆ స్టార్ హీరో ఎవరో కాదు .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంట‌. పవర్ స్టార్‌తోనే.. లీడర్ సీక్వెల్ తెర‌కెక్క‌నున్న వార్త‌లు ఇప్పుడూ ఇండ‌స్ట్రీలో వైర‌ల్ అవుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ఫేవ‌ర్ గా ఉండేలా ఆ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ర‌ట‌. పవన్ కళ్యాణ్ ఇప్పటీకే పాలిటిక్స్ లో ఉన్నారు కాబ‌ట్టి ఆయనకు ఈ చిత్రం మరింత ఫ్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. 2024 ఎన్నికల ముందు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పవన్ క‌ళ్యాణ్ .. భీమ్లానాయక్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత శేఖర్ కమ్ముల సినిమా ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news