దారుణం..దేవత పూనిందని కొట్టి చంపారు..!

గుజరాత్ లోని దేవ్ భూమి ద్వారక జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోపంతో ఉన్న దేవత పూనిందని ఓ మహిళను ఐదుగురు దారుణంగా కొట్టి చంపారు. కోపంతో ఉన్న దేవత పూనితే ఆ కోపంలో అందరిని చంపేస్తుందని భావించి ఈ దారుణానికి పాల్పడ్డారు. దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఓకంబది గ్రామానికి రమీలా అనే మహిళ తన భర్తతో కలిసి వెళ్ళింది. అయితే అక్కడ మహిళ ఒక్కసారిగా అమ్మవారు పూనినట్టు ప్రవర్తించింది. అక్కడే ఉన్న భూతవైద్యుడు రమేష్ మహిళకు కోపంతో ఉన్న అమ్మవారు పూనిందని చెప్పారు.

ఆ దేవతను వెంటనే వదిలించాలని లేదంటే అందరి ప్రాణాలకు ప్రమాదం అని హెచ్చరించాడు. అంతే కాకుండా దేవత వదిలిపెట్టాలి అంటే కొట్టాలి అని చెప్పాడు. ఆ భూత వైద్యుడి మాటలు విన్న మహిళ బందువులు కర్రలతో కొడుతూ మంటల్లో కాల్చిన ఇనుప రాడ్లతో కాల్చారు. దాంతో తీవ్రగాయాలతో రమీలా మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.