ప్రముఖ సీరియల్ నటి ఝాన్సి ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్ షాక్ అయ్యింది. స్టార్ మాలో వస్తున్న పవిత్ర బంధం సీరియల్ లో నటిస్తున్న ఝాన్సి కృష్ణా జిల్లా ముదినేపల్లి నుండి వచ్చారని తెలుస్తుంది. సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ తను రెంట్ కు ఉంటున్న శ్రీనగర్ కాలని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆమె సూసైడ్ కు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఆమె సీరియల్ యాక్టర్ నే ప్రేమిస్తుందట.. ప్రేమికుడితో గొడవే ఆమె మరణానికి కారణమని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో ఎలాంటి విషయాలు వెళ్లడవుతాయో చూడాలి.