కేన్స్‌లో సత్తా చాటిన ‘శాకుంతలం’.. నాలుగు అవార్డులు సొంతం

-

ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘శాకుంతలం’ తొలిరోజే డిజాస్టర్‌ టాక్ మూటగట్టుకుంది. ప్రొడ్యూసర్ దిల్‌రాజు కూడా తన పాతికేళ్ల సినిమా కెరీర్‌లో శాకుంతలం ఓ పెద్ద జర్క్‌ ఇచ్చిందని చెప్పాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించినా.. యశోద తర్వాత ఈ సినిమాకు సూపర్ హైప్ వచ్చినా.. అవేమీ ఈ చిత్రానికి వసూళ్లు తెచ్చిపెట్టలేకపోయాయి. ఇటు ప్రేక్షకులను అలరించలేక.. అటు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాతో గుణశేఖర్ కెరీర్​లో మరో ఫ్లాప్​ యాడ్ అయింది. అందుకే ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీ బాట పట్టింది. ఓటీటీలోనూ వ్యూయర్స్ ఈ చిత్రాన్ని అంతగా ఆదరించలేదు.

అయితే అట్టర్ ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న శాకుంతలం సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్​లో మాత్రం తన సత్తా చాటింది. ఏకంగా నాలుగు ఇంటర్నేషనల్ పురస్కారాలు సొంతం చేసుకుంది. కేన్స్ ఫెస్టివల్​లో శాకుంతలం సినిమాకు బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో నాలుగు అవార్డులు లభించాయి.

Read more RELATED
Recommended to you

Latest news