ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ గురించి తెలియని వారుండరూ. సోషల్ మీడియాలో అయాన్కు ఉండే ఫాలోయింగే వేరు. అయాన్ చిలిపి చేష్టలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఇక తాజాగా ఈ బుడతడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమాలోని లుట్ పుట్ గయా పాటను పాడాడు. ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ మురిసిపోయారు.
తాజాగా ఈ వీడియో చూసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ దీనిపై స్పందించారు. అల్లు అర్జున్కు స్పెషల్ థాంక్స్ చెబుతూనే అయాన్ను తెగ పొగిడేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్టు పెట్టారు. “థ్యాంక్ యూ లిటిల్ వన్. నీ ఫ్లవర్ అండ్ ఫైర్ రెండూ ఒకేదాంట్లో చూపించావు. ఇప్పుడు నా పిల్లల చేత శ్రీ వల్లి పాట ప్రాక్టీస్ చేయిస్తాను.” అంటూ అల్లు అర్జున్ను మెన్షన్ చేస్తూ షారుక్ పోస్ట్ చేశారు. ‘షారుక్ జీ సో స్వీట్ ఆఫ్ యూ’ అంటూ బన్నీ ఈ పోస్టుకు రిప్లై ఇచ్చారు.
Thank u lil one… you are flower and fire both rolled into one!!! Now getting my kids to practice singing @alluarjun’s Srivalli… ha ha https://t.co/XZr29SIhD2
— Shah Rukh Khan (@iamsrk) February 25, 2024