ముగిసిన మూడవ రోజు ఆట……పట్టుబిగించిన టీం ఇండియా

-

ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రాంచి వేదికగా జరుగుతున్న నాలుగోవ టెస్టులో భారత్ పట్టుబిగించింది. ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. దీంతో 192 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇండియా.. 3వ రోజు ఆట ముగిసే సమయానికి 40/0 రన్స్ చేసింది. ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించాలంటే ఇంకా 152 రన్స్ చేయాలి. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(24*), జైస్వాల్(16*) ఉన్నారు.

అంతకుముందు 2వ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 145 రన్స్ కే భారత్ ఆలౌట్ చేసింది.ఈ ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్లు మొదట్నుంచి వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.అశ్విన్ (5/51) ఐదు వికెట్లతో చెలరేగిపోయారు.కుల్డీప్ 4 వికెట్లు తీయగా, జడేజా (1/56) అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఆ జట్టు బ్యాటర్లలో క్రాలే (60), బెయిర్ స్టో (30) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరు అంతగా రాణించలేదు.తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 46 పరుగులతో కలిపి ఇంగ్లాండ్ 192 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది.మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 353 రన్స్ చేయగా.. టీమ్ ఇండియా 307 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news