శంకర్ ‘ఇండియన్ 2’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..!

-

కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా మీకు గుర్తుందా? 1996 లో ఆ సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింద. కాదు కాదు.. అంతకు మించి అనే చెప్పుకోవాలి. శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా వచ్చి 22 ఏళ్లు దాటింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ తీయడానికి సిద్ధమయ్యాడు డైరెక్టర్ శంకర్. రోబో 2.0 తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. దాని పేరు ఇండియన్ 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా… కమల్ హాసన్ కు జోడిగా కాజల్ నటిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. సంక్రాంతి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను డైరెక్టర్ శంకర్ తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశాడు. జనవరి 18 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. చూద్దాం.. ఈ సినిమా కమల్ హాసన్, శంకర్ లకు ఎంత పేరు తెస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news