రోబో సీక్వల్ గా 2.ఓ చేస్తున్న శంకర్ తన డ్రీం ప్రాజెక్ట్ ఇండియన్ పార్ట్ 2కి రంగం సిద్ధం చేస్తున్నారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 22 ఏళ్ల క్రితమే సంచలనాలు సృష్టించింది. భాషతో సంబంధం లేకుండా ఆ సినిమా విజయ దుందుంభి మోగించింది.
2.ఓ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగా భారతీయుడు-2 మీద దృష్టి పెట్టాడు శంకర్. ఆ సినిమా కోసం ఏకంగా ఓ ఫ్లైట్ అద్దెకు తీసుకుని మరి లొకేషన్ సెర్చ్ చేస్తున్నారట. ప్రస్తుతం థాయ్ లాండ్ లో శంకర్ ఇండియన్ 2 సినిమా లొకేషన్స్ వెతుకుతున్నట్టు తెలుస్తుంది. 2.ఓ నిర్మించిన లైకా ప్రొడక్షన్సే ఈ ఇండియన్ 2ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 2.ఓ సినిమా రిలీజ్ చేసి ఆ తర్వాత ఇండియన్ 2 మీద పూర్తిగా వర్క్ అవుట్స్ చేయనున్నారట శంకర్. లొకేషన్స్ సెర్చ్ పూర్తవగానే సినిమాకు సంబందించిన అఫిషియల్ డీటైల్స్ తో పాటుగా స్టార్ కాస్టింగ్ కూడా ఎనౌన్ చేస్తారని తెలుస్తుంది.