షారుక్ ఖాన్ స్టామినా, మన దేశం తో పాటు విదేశాల్లో సైతం.!

షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఎన్నాళ్ళ నుండో బాలీవుడ్ వారు వెయిట్ చేస్తున్న విజయం లభించింది అని సంబరాలు చేసుకుంటున్నారు.

దీపికా పడుకునె, జాన్ అబ్రహం ఇతర ప్రధాన తారాగణంతో తెరకెక్కిన పఠాన్ సినిమా అన్ని చోట్లా  అన్ని రకాల భాషల్లో మల్టీప్లెక్స్‌, సింగిల్ స్క్రీన్ తేడా లేకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ చిత్రం తో మళ్లీ బాలీవుడ్ లో నమ్మకం కలిగేలా చేసాడు. ఇక తాజాగా జరిగిన మీడియా సమావేశంలో కూడా షారుఖ్ ఖాన్ దీపికా పదుకునే ఫుల్ జోష్ మూడ్ లో కనిపించారు.

ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 634 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా యూనిట్ వర్గాలు నుండి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది . మరి ఇందులో ఇండియా నుంచే 395 కోటు రాగా ఓవర్సీస్ నుంచి 239 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇలా మనదేశంలో లో కంటే బయట దేశాల లో కూడా ఎక్కువ మొత్తంలో లో వసూళ్ళు రాబట్టడాన్ని సూపర్ ఘనత గా బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా 1000కోట్ల రికార్డ్ ను కచ్ఛితంగా టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.