సాధారణంగా హీరో అన్నాక ఫిజిక్ మెయింటైన్ చేయడం మామూలే. ఆ ఫిజిక్ ని జనాలకి ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ సోషల్ మీడియా సమాజంలో అప్పుడప్పుడు ఫోటోషూట్లు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉండాల్సి ఉంటుంది. దాదాపుగా ప్రతీ హీరో కూడా ఈ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తాడు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మాత్రం ఇలాంటి విషయాలని పెద్దగా పట్టించుకోడు. సోషల్ మీడియాలోకి కూడా మొన్న మొన్ననే వచ్చాడూ. ఐతే మొదటిసారిగా దానికి విరుద్ధంగా తన ఫోటోలని అభిమానులతో పంచుకున్నాడు.
ఫోటో షూట్ చేసిన ఫోటోలని ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు. ఆ ఫోటోల్లో శర్వానంద్ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఈ మధ్య సినిమా సినిమాకి తన మేకోవర్ లో వేరియేషన్ చూపిస్తున్న శర్వా, ఫోటో షూట్ లోనూ అదరగొట్టాడు. ట్రీండీ గెటప్ లో చూడగానే ఆకర్షించేలా ఉన్నాడు. మొత్తానికి శర్వా కూడా సోషల్ మీడియా లైన్లోకి వచ్చేసాడన్నమాట. ప్రస్తుతం శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వా, ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం సినిమాని ఒప్పుకున్నాడు.