పరిపాలన పరంగా జగన్ కు పేరు పెట్టేందుకు అవకాశం దక్కడం లేదు . అయినా ప్రతిపక్షాలు కొన్ని కొన్ని అంశాలను హైలెట్ చేసుకుంటూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తునే వస్తున్నాయి.అయినా, ప్రజల్లో మాత్రం జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురుస్తున్నాయి. కష్ట కాలం లోనూ ప్రజలను ఆదుకుంటూ, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, జగన్ అందరి వాడు అని తనని తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఇక సంక్షేమ పథకాలు అమలు విషయంలో పార్టీల బేధం లేకుండా అందరికీ సమానంగా ప్రభుత్వ ఫలాలు అందేవిధంగా జగన్ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలు గాని దేశవ్యాప్తంగా జగన్ ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగే లా చేస్తోంది.జగన్ ప్రభుత్వం కు ఈ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. టిడిపికి ఇవి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. దీంతో అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ, విమర్శలు చేస్తుండడంతో, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది. టిడిపి ప్రభుత్వం మాదిరిగా పావలా పని చేసి, పది రూపాయలు పబ్లిసిటీ పొందాలని జగన్ చూడడం లేదు. అయినా నెగిటివ్ ప్రచారం చేస్తూ, ప్రజల్లో చులకన చేసేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది .మొదట్లో ఈ వ్యవహారాలను జగన్ పట్టించుకోనట్టు గానే వ్యవహరించినా, ఇప్పుడు మాత్రం ఆ విషయాలపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అనవసర నిందలు మోసి, ప్రజల్లో చులకన అవ్వడం కంటే, ఎదురుదాడి చేసి, టిడిపికి తగిన బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతో, ఫైర్ బ్రాండ్ నాయకులను పెద్దఎత్తున రంగంలోకి దించాలని చూస్తోంది. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం తరఫున కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, వంటి వారే మాట్లాడుతూ వస్తున్నారు.దీంతో టిడిపి నాయకులు అదేపనిగా రాజధాని వ్యవహారంపై పోలవరం ప్రాజెక్టు సంక్షేమ పథకాలు ఎలా అన్నింటిపైనా రాద్ధాంతం చేస్తూ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తూ, అలాగే అనేక కీలకమైన నిర్ణయాలు అమలు కాకుండా కోర్టులో పిటిషన్ వేస్తూ, ప్రభుత్వ పాలనకు ఆటంకం కలిగిస్తు వస్తున్న వంటి వ్యవహారాలతో నియోజకవర్గాల వారీగా బలమైన వాయిస్ ఉన్న నేతలను తయారుచేసుకుని, టీడీపీ పై ఎదురుదాడి చేయాలని, గత ప్రభుత్వ అక్రమ వ్యవహారాలపైనా దృష్టి పెట్టి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, టిడిపి పై ప్రజల్లో మరింతగా ఆదరణ కోల్పోయే విధంగా చేయాలనే విధంగా జగన్ ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బలమైన వాయిస్తున్న నేతల లిస్ట్ తయారు చేసుకుని ఇక వారిని రంగంలోకి దించాలి అని జగన్ చూస్తున్నారట.
-Surya